Sunday, 11 March 2012

పాదు కలిచ్చినదెవరు భరతునకును
ఎవరినెత్తుకు వచ్చేను రావణుండు
ఎవరికాత్మలింగంబు తా నిచ్చె శివుడు
రాముడిచ్చెను సీతను రావణునకు  

Thursday, 8 March 2012

నీతి యన్న మాట నేటి కాలమునందు
నేతి బీరకాయ నేయ్యి యయ్యె
తెలివి జూపి ప్రజల తెగదోచుకొనెడి
నీతి లేని వారె నేత లైరె

Sunday, 4 March 2012

స్వాగతమ్మని శంకరార్యులు స్వాగతించిరి నన్నిటన్
నాగతమ్ముల సూకృతమ్ములు నన్ను నేడిట జేర్చెనే
ఈగణమ్మునచేరినంతనె యిట్టె బుట్టునె పద్యముల్
ఓగణాధిప నిన్ని వేడెద ఒజ్జయై పలికించవే

Saturday, 3 March 2012

వర్ణంబన బంగారము
వర్ణములన యక్షరములు వర్ణము గుణముల్
వర్ణింపనలవి కాని యీ
వర్ణములను వదలి వేయ వైభవమగునే?